Verse 1
నా హృదయము నీదు ఆలయం
రోజెల్ల స్తుతులే నాకు ప్రియం ||2||
నా యేసు రక్షకా - ఓదీన బాంధవా ||2||
కృతజ్ఞతాస్తుతుల్ స్తుతి కృతజ్ఞతల్
స్తుతి కృతజ్ఞతల్ కృతజ్ఞతా స్తుతుల్ ||2||
Verse 2
తప్పిపోయిన గొర్రెను నేనైతి నీత్రోవ విడిచితి
తప్పులెన్నో ఎన్నోచేసాను నేనొప్పుకొందు నీతో
నన్ను సృజియించి నాలో నివసించి - ఆశీర్వదించి నను అనుగ్రహించి
నన్ను నడిపిన కాపరి స్తుతులందుకోవా ఉపకారి ||నా హృద|| ||2 ||
Verse 3
నా శ్రమలో నీకు మొరపెడితే నీ కనికరమును పొందితి
నీ రాజ్యములో స్థలమును కోరితి అవ్యాజ ప్రేమ నొందితి
నన్ను ప్రేమించి ఉపదేశించి సహవాసించి యిల రక్షించి
త్రోవ చూపిన రాజా స్తుతులందుకో ఇది పూజ ||నా హృద|| ||2 ||