Verse 1
యెహోవా స్వరం బలమైనది - యెహోవా స్వరం ప్రభావము కలిగినది
Verse 2
అడవిని బోలిన హృదిని కదిలించును - కఠినమదిలో జ్వాలలురగిలించును - 2
ముసిరిన మబ్బులు విఫలము చేయును - నూతన శిశువుగ ప్రసవింపజేయును ||యెహో ||
Verse 3
జలములపై అది వినబడుచున్నది - ఉరుముల వలె అది గర్జించుచున్నది - 2
నిద్రించు హృదయాలు మేల్కొలుపుచున్నది - భావి బాధ్యతలు బోధించుచున్నది ||యెహో ||
Verse 4
శాపవృక్షాలు ముక్కలుగా చేయును - చెడుగు యోచనలు నిష్పలముగ మార్చును- 2
సంతోషముతో గంతులువేసే - ఎంతో బలమైన క్షేమము నిచ్చును ||యెహో ||
Verse 5
ఘనతా ఐశ్వర్యము - సమాధానం ధైర్యము
నెమ్మది నిచ్చి నడిపించు - సమాధానము - 2