Verse 1
పరలోక పట్టణము - పండ్రెండు గుమ్మములు
పండ్రెండు ముత్యములతో - పదిలముగా గట్టబడే
Verse 2
మండితంబగు పునాది - సూర్యకాంతపురాయి
రెండవది నీలము - మూడవది యమునారాయి ||పరలోక ||
Verse 3
పచ్చవైడూర్యము - కెంపు సువర్ణము
అచ్చ గోమేధికము - పుష్యరాగముతోడ ||పరలోక ||
Verse 4
పదియవది సూనీయము - పదకొండు పద్మరాగం
పండ్రెండు సుగంథము - పండ్రెండు ముత్యములు ||పరలోక ||
Verse 5
శుద్ధ సువర్ణ వీధుల్ - స్వచ్ఛమైన స్పటికం
సుందరముగ నుండు - సిద్ధపడిరండి ||పరలోక ||
Verse 6
గొఱ్ఱెపిల్ల దీపం - సూర్యుడక్కరలేదు
భూరాజుల్ తమ మహిమన్ - తీసుకొని వచ్చెదరు ||పరలోక ||
Verse 7
జీవజలపు నది - ప్రవహించుచుండెను
జీవంబు కల్గును - జీవించెదరు ప్రజలు ||పరలోక ||
Verse 8
ఇరుప్రక్కల నదికి - జీవ వృక్షముండె
పండ్రెండు నెలలకు - పండ్రెండు కాపులుకాయున్ ||పరలోక ||