Verse 1
దేవా నీకే స్తుతి ఆరాధన
చేరాలనేదే నా ప్రార్థన
నీ ఆత్మ శక్తితో ఈ స్థలాన్ని నింపి
నీ చిత్తమే నాలో జరిగించుము
హల్లే - హల్లేలూయ హల్లేలూయ ||2||
Verse 2
నీ కృపలో ఈ దినం మాకిచ్చావు
నీ రక్తంతో కడిగి రక్షించావు
పడిపోయిన మమ్ము నిలబెట్టావు
మా జీవితాన్ని స్థిరపరచావు
Verse 3
దుఃఖంలో నుండి మమ్ము ఓదార్చావు
బాధలలో నుండి బలపరచావు
జీవిత గమ్యం మాకు చూపించావు
శాంతి సమాధానం దయజేశావు