Verse 1
ప్రేమా యేసునీ ప్రేమా - ప్రేమా ఉన్నతా ప్రేమా
Verse 2
లోకములు మారిననూ - మారనీ ప్రేమా
సంద్రములు చల్లార్చనీ - యేసు ప్రేమా ||ప్రేమా ||
Verse 3
తల్లి బిడ్డను మరచిననూ - మరువనీ ప్రేమా
ఆదియంతము లేని ప్రేమా - ఏసు ప్రేమా ||ప్రేమా ||
Verse 4
పాపులను రక్షించే - కల్వరీ ప్రేమా
నిన్న నేడు ఏకరీతిగా - ఉన్న ప్రేమా ||ప్రేమా ||
Verse 5
నింగి నేల మారిననూ - మారనీ ప్రేమా
డంబము లేని శాశ్వత ప్రేమా - యేసు ప్రేమా ||ప్రేమా ||