Verse 1
పావన యేసుని పధములను - చేరుము నీవు ఈ క్షణమే
ధవళ వర్ణుడు క్రీస్తేసే - రత్న వర్ణుడు క్రీస్తేసే ||2||
సత్య వర్తనుడు క్రీస్తేసే - శుద్ధాత్మ దేవుడు క్రీస్తేసే ||3|| ||పావన||
Verse 2
పావన మూర్తి క్రీస్తేసే - పాపిని రక్షించెన్ క్రీస్తేసే
రక్షణ గీతము క్రీస్తేసే - ఆ.. ఆ... ఆ...........
శక్తియు, శాంతియు క్రీస్తేసే ||ధవళ ||
Verse 3
పరమ పవిత్రుడు క్రీస్తేసే - పరిశుద్ధదేవుడు క్రీస్తేసే
సర్వోన్నతుడు క్రీస్తేసే - ఆ.. ఆ... ఆ.........
సార్వభౌముడు క్రీస్తేసే
జీవం నీవే క్రీస్తేసు
మార్గం నీవే క్రీస్తేసు
శక్తియు నీవే క్రీస్తేసు
మృత్యుంజయుడే క్రీస్తేసు ||3 ||