Verse 1
నీ స్నేహంకన్నా విలువైనదున్నదా
నీ పిలుపు కన్నా ఘనమైనదున్నదా
పసిడికన్నా నీ చూపు మిన్న... - ధనముకన్నా నీ స్పర్శ మిన్న
నిన్ను కొలుచుటకన్నా మధురమైనదున్నదా
యేసయ్యా నీ సన్నిధి ఆనందపు పెన్నిధి
Verse 2
నీ చేయి పట్టి నడిచిన వేళలో - శ్రమలున్ననూ... శ్రమలున్ననూ..
నీతో పయనమైన మార్గములో - ముళ్ళున్ననూ... ముళ్ళున్ననూ...
ఈ ప్రగతిలో వ్యతిరేకతలున్నా నేనధిగమించెదన్
ఈ బాటలో గతుకులెన్ని ఉన్నా నీతో సదా సాగెదన్ ||నీ స్నేహం ||
Verse 3
పరమందు నిన్ను చూచెడి ధన్యత
నా కొసగెదవు... నా కొసగెదవు...
స్వర్ణవీధులలో విహరించుటకు
కొనిపోయెదవు.. కొనిపోయెదవు...
గొప్పదైన ఈ నిరీక్షణతో నే వేచియుంటిని
నీ కుడి పార్శ్వమందు స్థానమునకై ప్రార్ధించుచుంటిని ||నీ స్నేహం ||