Verse 1
సంతోషం ఉత్సాహం కలసిన జయగీతం
యేసే నారక్షకుడు ఇదే మా నినాదం
Verse 2
చితికిన మాబ్రతుకును అతికినాడనీ
గతుకుల సుడిదారినుండి లేపినాడనీ ||2||
అధికమైన ప్రేమతో చేరదీసినాడనీ ||2||
తన రక్షణకౌగిలిలో కాపాడుచున్నాడని ||మేమాయన ||
Verse 3
ధరను ప్రేమించిన నరరూపధారుడని
నరులకై తన ప్రాణం ధారపోసినాడని ||2||
మృతిని గెల్చి తిరిగిలేచి విజయమిచ్చాడని ||2||
తన సంఘ వధువుకై తిరిగి రానున్నాడని ||మేమాయన ||
Verse 4
భూదిగంత వాసులారా యేసువైపు చూడుడి
దీనమనస్సుతో ప్రభుని ఆశ్రయించుడి ||2||
దురలవాట్ల కీడునుండి విమోచించును
మనశ్శాంతి రోగశుద్ధి మోక్ష ప్రాప్తి నిచ్చును ||2|| ||మేమాయన ||
Verse 5
మేమాయన ప్రజలం ఆయన మేపు గొఱ్ఱెలం
స్తుతి చేయుచు ప్రకటించుచు ప్రభుకృపలో సాగెదం