Verse 1
ప్రార్ధన మందిరమా ప్రార్ధనా మందిరమా
భువిజన సువార్త సంఘమా
సంఘమా సంఘమా ప్రభుని మాట చాటుమా || ప్రార్ధన ||
Verse 2
కన్నులెత్తి నీవు చూడు కన్పించు పైరుచేలు
కోత కొరకు సంసిద్ధమాయెను పనివారేలేరు
లేరు లేరు కోత పనిలోజేరు ||ప్రార్ధన ||
Verse 3
మాసిదోనియా వాడు కలలో కనిపించె చూడు
వచ్చి మాకు సాయంబు చేయుమని అదిగో వేడుచున్నాడు
చూడు చూడు క్రీస్తు ప్రేమపాడు ||ప్రార్ధన ||
Verse 4
దున్నేవారు లేక బీడులు బీటలువారే భూముల్
కన్నీటితో ఆత్మల సంపాదించుటకు
భారంతో నీవు సాగు ||ప్రార్ధన ||