Verse 1
ముత్యాల కన్నా రత్నాల కన్నా - యేసు రాజన్నా నాకెంతో మిన్న
కన్న బిడ్డల కన్న - అన్న దమ్ముల కన్న
బంధుమిత్రుల కన్నా - బహు మంచివాడన్న
Verse 2
మరియమ్మ గర్భాన పుట్టినాడన్న - మహిలోకి రక్షణ తెచ్చినాడన్న
మార్గముతానే అన్నాడన్న - మరణముగెలిచి లేచినాడన్నా ||ముత్యాల ||
Verse 3
పాపుల కొరకై వచ్చినాడన్నా - ప్రాణము దానము చేసినాడన్నా
జీవము తానే అన్నాడన్న - జయజీవితమును ఇచ్చినాడన్నా ||ముత్యాల ||
Verse 4
నమ్మిన వారిని కాచువాడన్న - వేడిన వారిని బ్రోచువాడన్న
దారుణహింసను ఓర్చినాడన్న - ధరణికి దీవెన తెచ్చినాడన్నా ||ముత్యాల ||