Verse 1
యేసు నాథా దేవా
వందనాలు రాజా.. వందనాలు
రాజాధి రాజా నీకే వందనాలు
రవి కోటి తేజా నీకే వందనాలు (2) ||యేసు నాథా||
Verse 2
పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు
పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)
పన్నెండు గుమ్మముల...
పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా||
Verse 3
నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)
నీ నీతి నీ రాజ్యం...
నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా||
Verse 4
హీనుని దీవించి ఘనునిగా చేసావు
నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)
నా సల్లనయ్యా...
నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా||
Verse 5
కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను
చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2)
నీ మనసే వెన్నయ్యా...
నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||