Verse 1
నిన్ను తలచి నిన్నేకోరి - నీకై వేచియున్న
క్షణమైన నీవులేక - బ్రతుకలేనయ్యా - 2
యేసయ్యా నీ ప్రేమే నన్ను ఆకర్షించెను
నా యేసయ్యా నీ కృపే నన్ను ఆదరించెను
కలువరిలో సిలువపై యాగమైతివి
నీ ప్రేమ నీ త్యాగం మరువలేనయ్యా || నిన్ను ||
Verse 2
పెండ్లికుమారుని రాక కోసమై - బుద్ధిగల కన్యలు ఎదురు చూచినట్లు
జారవిడచిన నాణెం కొరకై - ఒక స్త్రీ ఓపికతో వెదకినట్లుగా
వెయ్యి కళ్ళతో నీదు రాకకై
వేచి వేచి చూస్తున్నానయ్యా నే చూస్తున్నానయ్యా ||నిన్ను ||
Verse 3
ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న - నా ప్రియ యేసుడు నాకై వచ్చును
నాదు రూపము మారిపోవును - నేను ఆయనకు సొంతమవుదును
నేను ఆయనతో యుగయుగాలు జీవించెదను
ఆరాధింతును నే ఆరాధింతును ||నిన్ను ||