Verse 1
రాజాధిరాజు - దేవాదిదేవుడు
త్వరలో వచ్చుచుండెను - 2
మన యేసురాజువచ్చును
పరిశుద్ధులన్ చేయు మనలన్
ఆహా మనమచ్చటకేగుదం - 3 || రాజాధి ||
Verse 2
ముద్రపొందిన శుద్ధులందరు - తెల్లంగి ధరించెదరు
జయజెండాలు పట్టుకొందురు - విమోచన్ గీతం పాడెదరు
ఆహా ఎంతో ఆనందమది - 3 ||రాజాధి ||
Verse 3
నిషిద్ధమైనది లోనికివెళ్ళదు - పరలోకపాలనదీ
దుఃఖ వ్యాధి అచ్చటలేవు - ఆకలి దప్పిక లచ్చటలేవు
ఒకే హల్లేలూయ ధ్వనియే - 3 ||రాజాధి ||
Verse 4
అందరు కలసి విందులో చేరి - ఆనందముగ నుందురు
మధ్యాకాశములో విందు - విమర్శింపబడెదరు
పరిశుద్ధులు పాల్గొందురు - 3 ||రాజాధి ||
Verse 5
పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు - సమయంబు ఇదియేను
నీతిమంతుడు నీతిచేయును - ఫలముతోనే వచ్చెదను
ఆమెన్ యేసుప్రభూ రమ్మయ్యా - 3 ||రాజాధి ||