Verse 1
నాలో ఉన్న ఆనందం
నాకున్న సంతోషం
నా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో||
Verse 2
నా ఆశ్రయము నా దుర్గము
నా కోట నీవే యేసు
నా బలము... నా యేసుడే (2)
Verse 3
గాఢాంధకారములో నే సంచరించిననూ
ఏ అపాయమునకు నే భయపడను (2)
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము||
Verse 4
నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును
నన్నాదరించును నా వెంట వచ్చుఁను (2)
చిరకాలము నేను నీ మందిరావరణములో
నివాసము చేసెదను నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము||