Verse 1
దైవ జనమా పాడి స్తుతించెదం - దేవ దేవుని కీర్తించెదం
అధిక స్తోత్ర పాత్రుడే అద్వితీయుడే
Verse 2
ఆపదలో ఆశ్రయదుర్గముగా - కాచెతన కనుపాపవలె
నీతిగల ఆ ... కృపామయుని - నిత్యస్తోత్రము చేయుదము ||దైవ జనమా ||
Verse 3
భూమి ఆకశముల పాలకుడ - మాట నెరవేర్చెడి వాడా
తనదు విశ్వాస్యత తలంచి - మహిమ పరతుము మన ప్రభుని ||దైవ జనమా ||
Verse 4
సాటిలేని మేటినామముతో - సర్వ మహిమలు గల ప్రభుని
సర్వోన్నతుని సర్వేశ్వరుని - సర్వదా కొనియాడెదము ||దైవ జనమా ||
Verse 5
రాత్రింబవలు దూతగణముల్ - గాన ప్రతిగానము సేయ
పరిశుద్ధునికి పరమ ప్రభునికి - స్తుతియాగములను చేయుదము ||దైవ జనమా ||