Verse 1
మారని ప్రేమ చూపు ప్రాణ స్నేహితుడా
నను మానిషిగ మలచిన నీ ప్రేమ కెవరు సరిరారు
చేదైన అనుభవాలను - మధురముగా
మార్చిన నా విమోచకా
నీ కన్నా నాకిల లేరెవరు మిన్నగా
నీవేగా ప్రతి క్షణము - కాచావు నాన్నగా
నా ప్రాణం నా ధ్యానం - ఎన్నటికి నీవెగా
నీ కోసం జీవిస్తా కడవరకు సాక్షిగా || మారని ||
Verse 2
ఒంటరి బ్రతుకులో వీడని నీడలా - నాతో నడచిన నా దైవమా
ఆశల సుడులలో చిక్కిన వేళలో - విడుదల నిచ్చిన ఆత్మ బంధమా - 2
శాశ్వత ప్రేమను నాపై చూపినా - ఆశ్రిత పాలకా నా ప్రియ రక్షకా
తుది శ్వాసవరకు కరుణ చూపినా ||నీకన్నా ||
Verse 3
బంధువులందరూ మరిచిన వేళలో - అండగ నిలిచిన ఆప్త మిత్రమా
వంచన కారుల మోసపు తలపుల - వలలో పడనీయని వాక్యరూపమా
నీ సన్నిధానపు ఒడిలో పెంచుచూ - తల్లిని మించిన ప్రేమను పంచుచూ
నీ సేవకొరకె నన్ను నిలుపుమా ||నీకన్నా ||