Verse 1
కల్వరి గిరిలోన - సిల్వలో శ్రీయేసు
పలుబాధ లొందెను - ఘోరబాధలు పొందెను
నా కోసమే - అది నీ కోసమే || కల్వరి ||
Verse 2
ప్రతివానికి రూపునిచ్చె - అతనికి రూపులేదు
పదివేలలో అతి ప్రియుడు - పరిహాసముల నొందినాడు
నా కోసమే - అది నీ కోసమే ||కల్వరి ||
Verse 3
ధారగ రక్తంబు కారి - దాహము దాహమనెను
పారబోయబడి - పాపంబుగా చేయబడె
నా కోసమే - అది నీ కోసమే ||కల్వరి ||
Verse 4
అందరి దోషము మోసి - పొందెను ఘోరవ్యాధి
నిలువెల్ల గాయంబు పొంది - విలువైన స్వస్థత నిచ్చు
నా కోసమే - అది నీ కోసమే ||కల్వరి ||