Verse 1
మరణమంత బలవంతమైనది నీ ప్రేమ
మనుజ జ్ఞానమునకందని ఉన్నతమగు ప్రేమ
హేళన సహించిన - అవమానము భరించిన
దూషించిన - హింసించిన
అలుపెరుగక నీ కరుణను చూపించిన యేసయ్యా
Verse 2
కొరడాలతో కొట్టినా - మోమున ఉమ్మి వేసినా
ముండ్లమకుటముంచినా - ముసుగేసి తిట్టినా
మొత్తినా....... అపహసించినా.........
అలుపెరుగక నీ కరుణను చూపించిన యేసయ్య ||మరణ ||
Verse 3
గడ్డము పెరికివేసినా - అంగీకై చీట్లువేసినా
యూదులకు రాజని - అపహాస్యము చేసినా
నెట్టినా..... శ్రమలు పెట్టినా ......
అలుపెరుగక - నీ కరుణను చూపించిన యేసయ్య ||మరణ ||
Verse 4
వీధులలో నడిపిన - చర్మము చిట్లగొట్టినా
కాళ్ళుచేతులలో - సీలలు దిగగొట్టినా
ఈడ్చినా..... ఈటెతొ పొడిచినా.....
అలుపెరుగక నీ కరుణను చూపించిన యేసయ్య ||మరణ ||