Verse 1
స్త్రీలలో అధిక సుందరివగుదానా
వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి
నా ప్రియుడు ధవళ వర్ణుడు నా ప్రభుడు రత్నవర్ణుడు
పదివేల పురుషులతనికి సాటికారు
Verse 2
ఆతని శిరము అపరంజి వోలె అపురూపమైనది
ఆతని నయనాలు నిర్మలమైనవి నిరుపమానము
నీతి న్యాయముల నిలయములు కరుణాకాంతుల వలయములు ||నా ప్రియుడు ||
Verse 3
ప్రాణత్యాగము చేసిన ప్రియుడు విజేత నా వరుడు
రుధిరధారలు చిందిన యేసుడు అతడె మనోహరుడు
నను బ్రోచిన కరుణాసాగరుడు నా జీవిత నావకు నావికుడు ||నా ప్రియుడు ||