Verse 1
యేసే మార్గము - యేసే సత్యము
యేసే జీవము - ఆ యేసే ఆ దైవము
కరుణతో నిండిన ప్రేమ మూర్తిగా - 2
సిలువలో నీకై ప్రాణమిచ్చెగా... అందుకే
జై యేసు అనవా జై జై క్రీస్తు అనవా - 2
యేసుని చెంతకు చేరవా - నిత్య జీవమును పొందవా - 2 || యేసే ||
Verse 2
పాపుల పెన్నిధి పరమ దయానిధి
ప్రభు యేసే అని ప్రణుతులు చేయవా - 2
కలువరి సిలువలో కార్చిన రుధిరం
చూపెను మనకు ఆ ప్రేమ మధురం - 2 ||జై యేసు ||
Verse 3
నీకై ఈ లోకానికి వచ్చి
నీ పాప భారాన్ని మోసి - 2
నీ పాపమంతటిని తీసి
నిత్య జీవము నీకు యిచ్చెను - 2 ||జై యేసు ||