Verse 1
నిన్ను స్తుతియించగా నిన్ను భజియించగా
నిన్ను కొనియాడగా - నిన్ను మదివేడగా
మా కోసం వచ్చితివా మా ప్రభువా - 2
నీతో నడిచెదన్ నజరేయుడా
నిన్నే పాడెదన్ నజరేయుడా - 2
Verse 2
ప్రకృతి ఎంతో ఘోషించినా
అపాయాన్ని నాదరికి చేరనీయవు
కొండలూ కోనలూ తరలి పోయినా
నీనుండి నన్ను వేరు చేయవు ||నీతో ||
Verse 3
పితరుల యెడ పగలంతా మేఘ స్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై కాచిన దేవా
(నీ) బిడ్డలమగు మముకూడా అదే రీతిగా
కాచి సిద్ధ పరుచుము కన్నతండ్రిగా ||నీతో ||