Verse 1
శిలువ దర్శనం - పాప హరణము
రక్త ప్రోక్షణం - ముక్తి దర్శనం
ఆద్యంతమును - మహిమానందం
యేసుప్రేమకు - ఇది నిదర్శనం
శరణం శరణం శరణం శిలువే శరణం
శరణం శరణం శరణం యేసే శరణం
Verse 2
ఆధ్యాత్మిక అంధులకు దృష్టి ప్రసాదం
మదిని తొలుచు వేదనలకు శాంతి ప్రసారం ||2|
విశ్వసించువారికెల్ల - వీక్షించుభాగ్యం
క్షమించబడినవారికెల్ల - మోక్షం సిద్దించును ||శరణం|| ||2 ||
Verse 3
అడియాశల బ్రతుకులకు ఆశాదీపం
ఎడతెరిపిలేని దుఃఖితులకు ఆశ్రయస్థానం
మరణపాత్రులెల్లరికి - జీవస్థావరం
జీవితాన్ని మలుపు తిప్పు - గమ్య స్థానం ||శరణం|| ||2 ||