Verse 1
స్తుతికి పాత్రుడా నాధ స్వరూపుడా - దేవుని సృష్టికి ఆది సంభూతుడా
నీ ఆరాధనే నా భాగ్యమాయెను - నీ ఆరాధనే నా జీవమాయెను
Verse 2
విలువలేని నాకు విలువైన రక్తమిచ్చి - రూపులేని నాకు నీరూపమిచ్చి
నన్ను నీ కుమారునిగా మార్చిన నా ప్రభువా ||స్తుతికి పాత్రుడా ||
Verse 3
పరిమళ సువాసనగా నేనుండునట్లు - అభిషేక తైలముతో నన్ను హత్తుకొని
నన్ను నీ సేవకునిగా మార్చిన నా ప్రభువా ||స్తుతికి పాత్రుడా ||