Verse 1
జీవోదయమై జీవము కలిగిన - జీవపు తెరలేచే
జీవాధిపతి మరణపు తెరలను - చీల్చివైచి లేచె || జీవోదయమై ||
Verse 2
పరమ మందిరము ప్రవేశింపగా తెరచెను మార్గంబు
పరమ శరీరపు తెర తెరచెను గుడి తెరచినిగె నిజంబు ||జీవోదయమై ||
Verse 3
ధరణియు వణకెను గిరులును గిరగిర తిరిగి బ్రద్దలాయె
పరమ గురుని మరణ రంగస్థలమున మరణమె మరణించె ||జీవోదయమై ||
Verse 4
సూర్యుడు అస్తమించెను నీతి సూర్యుడస్తమింప
సూర్యోదయమిదే మూడవ దినమున చూడరండి వేగ ||జీవోదయమై ||
Verse 5
దేవుని నాటక రంగస్థలమది దీక్షతో గమనింప
జీవము నిత్యజీవము మరి ఉజ్జీవము కలిగింప ||జీవోదయమై ||
Verse 6
తొలకరి వాన కాలముగాన తెలిసికొనుము లెమ్ము
వెలుగును పొందుము కడవరివర్షకాలమిదే రమ్ము ||జీవోదయమై ||
Verse 7
కడవరి వర్ష కాలముగనుక కనులు తెరచి చూచి
అడుగుము యేసుని వర్షము కొరకు బడయువరకు లేచి ||జీవోదయమై ||