మారుచున్న లోకములో - మారే స్థితిగతులలో
మార్పులేని యేసువైపు - సాగిపోదును
యేసు నాకుచాలని - సంతసింతును
విశ్వాసము అంతరించే - ఈ అంత్యకాలములో
విశ్వాస బలముతో - లోకమున్ జయించెదన్
విశ్వాసము ద్వారానే - యేసు మనలో జీవించున్
మనయందు విశ్వాసం - యేసే కొనసాగించున్
విశ్వాసమే మన విజయం - విశ్వాసమే మన బలము
విశ్వాసమునకు కర్త - యేసు వైపు చూచెదం ||మారచున్న ||
ప్రేమ చల్లారిపోయే - ఈ కడవరి దినములలో
ప్రేమ కలిగి సత్యములో - క్రీస్తువలె ఎదుగుదుము
కడు శ్రేష్టమైన ప్రేమలో - కలకాలము నిలచెదము
యేసువలె ప్రేమచూపి - క్రీస్తు ప్రేమ చాటెదం
ప్రేమను చూపించెదము - ప్రేమను ప్రకటించెదము
ప్రేమ స్వరూపి యేసువైపు చూసి సాగెదం ||మారుచున్న ||
క్రీస్తునందు గొప్ప నిరీక్షణ మనము కలిగియున్నాము
రక్షకుడేసు మనకై త్వరలో రానున్నాడు
పరమందు స్వాస్థ్యమును - భద్రపరచి యున్నాడు
ఈ నిరీక్షణ మనలను - సిగ్గు పరచదు
శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తులో మనకున్నది
నిరీక్షణకర్త యేసువైపు చూచి సాగెదం ||మారుచున్న ||
యేసు నాకు చాలు - యేసు ప్రేమ చాలు
యేసు వైపు చూచినే - సాగిపోదును