Verse 1
యెహోవా యీరే - 2 సమకూర్చు వారు మీరే (మాకు) - 2
హల్లెలూయా - హల్లెలూయ నీకే ఆరాధనా - 4
సమకూర్చు వానికే ఆరాధన (మాకు) - 2 || యెహోవా ||
Verse 2
ముదిమి వయస్సులో గర్భము తెరచితివి
బహుమానంబునే తిరిగి బలిగా కోరితివి - 2
అబ్రహాముకు సమకూర్చినా యెహోవా యీరే - 2
సమకూర్చువానికే ఆరాధనా (మాకు) - 2 ||యెహోవా ||
Verse 3
ధనము పోయిన ఘనత పోయిన
బలము పోయిన కన్న బిడ్డలు లేకున్న - 2
యోబుకు సమకూర్చినా - యెహోవా యీరే - 2
సమకూర్చు వానికే ఆరాధనా (మాకు) - 2 ||యెహోవా ||