Verse 1
సమయమిదే సమయమిదే
సంఘమా సమయమిదే
సీయోనులో చేరుటకు
సంఘమా సమయమిదే ||సమయమిదే||
Verse 2
చూడుము భూమి మీద
పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించుము
జీవ వాక్యం పట్టుకొని ||సమయమిదే||
Verse 3
సీయోనులో వశించు
సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము
మార్పునొందుము స్ఫటికముగా ||సమయమిదే||
Verse 4
పిలుపుకు తగినట్లుగా
నీవు నడువుము ప్రభు యేసుతో
ప్రేమలోనే నిలువుము
నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే||
Verse 5
సీయోను రారాజు
నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము
నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||