Verse 1
నా సంకటములన్నియు తీరిపోయె - సంహారదూత నను దాటిపోయే
Verse 2
గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో - కడుగబడి నేను రక్షణ పొందితిన్ ||నా ||
Verse 3
ఫరోకు నేనింక దాసుడన్ కాను - పరమ కానానుకు హక్కుదారుడన్ ||నా ||
Verse 4
మారాను మధురముగా మార్చినాడు - బండల పగలగొట్టి దాహం తీర్చెను ||నా ||
Verse 5
మనోహరముగా నున్న కానాన్ రాజ్యము - అదే నాకు స్థిరమైన యవకాశము ||నా ||
Verse 6
ఆనందమే పరమానందమే - కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా ||
Verse 7
అరణ్య జీవితమున యేసు నాధుడు - ప్రతిదినము నూతన మన్నా నాకు యిచ్చును ||నా ||
Verse 8
నా బలము నా ఆశ్రయము - నా రక్షణ యేసయ్య హల్లెలూయ ||నా ||