Verse 1
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2)
నీవు చేసినవి చూపినవి వింటే
హృదయం తరియించి పోతుంది దేవా
నీవు చూపినవి చేసినవి చూస్తే
హృదయం ఉప్పొంగి పోతుంది దేవా
దేవా... యేసు దేవా – నాధా... యేసు నాధా
Verse 2
నా మార్గమంతటిలో నను కాపాడినావు (2)
నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2)
ఏమేమి మారినా నీ మాట మారదు (2)
అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా||
Verse 3
మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు (2)
ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు (2)
ఏమేమి మారినా నీ మాట మారదు (2)
అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా||