Verse 1
విడువని దేవుడ నీవే మామంచి యేసయ్యా
పాపికి ఆశ్రయపురము - నీవే మెస్సయ్యా
ప్రేమించుటకు క్షమియించుటకు రక్షించుటకు అర్హుడ నీవే - 2
యేసయా యేసయా - 4
Verse 2
నలువది సంవత్సరములు మాపితరుల నడిపినదేవా
అరణ్యమార్గమై అన్ని నీవైనావు
జీవాహారమై ఆకలి తీర్చావు
కదిలే బండవై దాహము తీర్చావు ||యేసయా ||
Verse 3
యిత్తడి సర్పమువలె పైకెత్తబడినావు
నిన్ను చూచినవారు ఆనాడు బ్రతికారు
సిలువలో వ్రేలాడే నీదరి చేరిన జనులందరు
నేడు నిత్యం బ్రతుకుదురు ||యేసయా ||