Verse 1
ఇదిగో - ఇదిగో - ఇదిగో - ఇదిగో
ఇదె - ఇదె - ఇదె - ఇదిగో
ఇదె - ఇదె - ఇదె - ఇదిగో
Verse 2
ఇదియే మిక్కిలి అనుకూల సమయము - ఇదియే ఘనరక్షణ దినము
ఇప్పుడే యేసుని తప్పక నమ్మి - రక్షణ పొందుము సోదరా ||ఇదిగో ||
Verse 3
పాప మెరుగని యేసుక్రీస్తు - పాపముగను చేయబడె
శాపగ్రాహి ఆయె సిలువలో - శ్రమలను పొందెను సోదరా ||ఇదిగో ||
Verse 4
ఆకాశము క్రింద మనుష్యులలో - ఏ నామమున రక్షణ లేదు
యేసు నామమున రక్షణ కలుగును - ఇప్పుడే నమ్ముము సోదరా ||ఇదిగో ||
Verse 5
నేనే ద్వారము నా ద్వారానే - లోపల ప్రవేశించిన యెడల
రక్షించబడునని చెప్పిన ప్రభు - చెంతకు చేరుము సోదరా ||ఇదిగో ||
Verse 6
ఇంత గొప్ప రక్షణను మనము - నిర్లక్ష్యము చేసిన యెడల
యేలాగు తప్పించు కొందుము - ఇప్పుడే తిరుగుము సోదరా ||ఇదిగో ||