Verse 1
అది ఎంత సత్యమైన ప్రేమ - దైవప్రేమ నిత్యప్రేమ
అది కొలువగలేని ప్రేమ - దైవప్రేమ నిత్యప్రేమ
ఏ పరిస్థితిలోను ఏ షరతులు లేక
ప్రేమించు నన్ను వందనం ప్రభునకు
Verse 2
దేవుని నే మరచినను - ఆ ప్రేమను నే మరచినను - 2
కనికరించు ఆ హృదయమెప్పుడు - నాకై పరితపించు
ఎంతగానో నన్ను ప్రేమించు ||అది ఎంత ||
Verse 3
తల్లియే నన్ను మరచినను - ఈ లోకమే ద్వేషించినను - 2
మంచి కాపరి నన్ను వెదకును - నాకై పరితపించు
ఎంతగానో నన్ను ప్రేమించు ||అది ఎంత ||