Verse 1
స్నేహితుడు ప్రాణప్రియుడు - ఇతడే నాప్రియ నాయకుడు
నా సమీప బంధువుడు - దీన పాపి బాంధవుడు
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
Verse 2
తోడు నీడ లేని నను చూడవచ్చెను - జాడలు వెదకి జాలి చూపెను
పాడైన బ్రతుకును బాగుచేసెను - ఎండిన మోడు చిగురించెను ||వినుమా ||
Verse 3
చీకటి క్రియలలో చిక్కుకొంటిని - పాపపు టురులతో పట్టబడితిని
యేసుడు నాలో ఉదయించెను - ప్రాణము క్రయధనముగ నిచ్చెను ||వినుమా ||
Verse 4
దాహము కోరి నేను దూరమైతిని - మరణపు మారా దాపురించెను
క్రీస్తు జీవము మధురమాయెను - క్షీర ధారలు ప్రవహించెను ||వినుమా ||
Verse 5
బాధలయందు నన్నాదరించెను - శోధనలందు తోడు నింపెను
నా మొఱలన్నియు ఆలకించెను - నా భారమంతయు తొలగించెను ||వినుమా ||