Verse 1
యేసునామములో శ్రీ యేసునామములో
పయనించెదన్ నేను ఈ భువిలో - 2
పురోగమన మార్గములో ప్రభువు అడుగుజాడల్లో
ప్రభువు అడుగుజాడల్లో ఆవెలుగునీడల్లో || యేసు ||
Verse 2
అగమ్యమైన లోకములో - అంతులేని వేదనల్లో - 2
అజేయుడైన క్రీస్తుప్రభునిలో - అంతమువరకు నే సాగెదన్ ||యేసు ||
Verse 3
ఆపదలే కల్గినా - అవరోధములొచ్చినా - 2
అపవాదములే రగిలినా - ఆయన కొరకే నే సాగెదన్ ||యేసు ||
Verse 4
సార్వభౌముని నేనేయనిన - సర్వమునాకే సాధ్యమనిన - 2
సర్వ శక్తుడే నాయకుడై - సర్వముతానై నడిపించగా ||యేసు ||