సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
మనము గొప్పవారము కాదు
మనము మంచివారము కాదు
మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు
దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
మీ శరీరము దేవుని ఆలయమిది
మీరు విలువ పెట్టి కొనబడిన వారు
సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||