Verse 1
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
యేసయ్యా నిన్ను నేను సన్నుతింతును ప్రభూ
యేసయ్యా నిన్ను నేను ఆరాధింతును
Verse 2
నీవే నా ఆధారం - నీవే నా ఆనందం
నీవే నా ఆశ్రయం - నీకే నేను అంకితం
నీవే నా రక్షణ - నీవే నిరీక్షణ
నీవే నా దైవము - నీవే నా గానము ||హల్లెలూయ ||
Verse 3
నీవే నా మార్గము - నీవే నా జీవము
నీవే నా సత్యము నిలుతువు నిత్యము
నీవే నా కాపరి - నా మంచికాపరి
ప్రధాన కాపరి - నా గొప్ప కాపరి ||హల్లెలూయ ||
Verse 4
నీవే నా రాజువు - రాజాధిరాజువు
మహాత్మ్యముగల - మహారాజువు
నీవే అధికారివి - సర్వాధికారివి
నా జీవితానికి - నీవే సహకారివి ||హల్లెలూయ ||