Verse 1
ఎప్పుడో పిలిచిన దేవుని - క్రొత్తగా చూస్తున్నాను
ఆయనకు నాయెడ కలిగే - హెచ్చైన వాత్సల్యం
Verse 2
సత్యమైన లక్ష్యముతో - హెచ్చరిస్తు ఉన్నాడు
స్వచ్ఛమైన ప్రేమచూపి - గుర్తు చేసుకుంటున్నాడు (2)
శోధనలో పడిపోకుండా - ప్రార్ధించమన్నాడు (2)
ఎక్కడైనా తోడుంటానని - మక్కువతో చెబుతున్నాడు
మక్కువతో చెబుతున్నాడు ||ఎప్పుడో ||
Verse 3
అపాయమేదీరాదని - అభయదానమిచ్చాడు
బలహీనత బలముగ మార్చి - నడిపిస్తానన్నాడు (2)
నెళవరులే నిన్ను మరచినా - నేను మరువనన్నాడు
నా చిత్తం జరిగేవరకూ-చేయి విడువనన్నాడు - చేయి విడువనన్నాడు ||ఎప్పుడో ||
Verse 4
దినదినము నన్నెంతో ధైర్యపర్చుచున్నాడు
ఘనమైన తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు - జరిగించుచున్నాడు