Verse 1
అద్వితీయ దేవా - ఆది అంతము లేనివాడా
కృపానిధి ప్రేమానిధి - మమ్ములను రక్షించినావా
Verse 2
మానవులను సృజియించక మునుపే
మానవుల అంతమెరిగినావే
మానవులను నీ చేతితో నీ ఆత్మనిచ్చి నిర్మించినావే ||అద్వితీయ ||
Verse 3
పాపశాపముతో నిండియున్న - పతనమైన మానవుని చూచి
ప్రేమించి నావే ప్రాణమిచ్చినావే
సిలువలో నీ రుధిరం చిందించినావే ||అద్వితీయ ||
Verse 4
నీతిలేని నన్ను నీవు పిలిచి - నీదు రాజ్యమందు స్థానమిచ్చి
నీ సేవలో నన్ను నడుపుచూ
అరచేతిలో నన్ను చెక్కుకుంటివే ||అద్వితీయ ||