Verse 1
నదులై ప్రవహించే నీ దివ్య వాక్యం - నా విశ్వాసపు వేళ్ళు తడుపు అనునిత్యం
స్తుతించెద ఆత్మలో ఫలించెద - నీ ప్రేమాతిశయము చేత మూర్చిల్లెద - 2
ఆనందం ఆనందం ఆనందం - హల్లేలూయా
ఆనందం ఆనందం ఆనందం - హల్లేలూయా || నదులై ||
Verse 2
ఇవి నదులు మాత్రమే కావు - జీవజలపు ఊటలు
నా మదిని పులకరింపజేయు - ముత్యాల మాటలు - 2
పాటలు - బాటలు - కోటలు - వరాల మూటలు ||ఆనందం ||
Verse 3
ఇవి ఊటలు మాత్రమే కావు - సిలువ రుధిర ధారలు - 2
నా పాప రోగమును మాన్పెడి - దివ్య ఔషధములు - 2
కృపలు - కనికరములు - వరములు - ఆత్మ ఫలములు ||ఆనందం ||