Verse 1
యౌవనుడా ఓ యౌవనుడా ఏది నీ జీవితం
ఎచటికోయి పయనము ఏది నీ గమ్యము
ఏసుకే అది అర్పించుము || యౌవనుడా ||
Verse 2
బాల్య దినములయందే - నీ సృష్టికర్తను గుర్తించుము
యవ్వనమందే జన్మించిన - బలుని చేతిలో బాణానివే ||యౌవనుడా ||
Verse 3
యవ్వనమందే సంతోషము - తీర్పు ఉన్నది గమనించుము
వాక్య ఖడ్గము ధరియించుము - దుష్టుని ఛేదించుము ||యౌవనుడా ||
Verse 4
యవ్వనేచ్ఛల నుండి దూరముగా - పారిపోవుము
యవ్వనమును బట్టి - ప్రభుని దుఃఖపరచకుము ||యౌవనుడా ||
Verse 5
మాటలలో ప్రవర్తనలో - ప్రేమలో పవిత్రతలో
విశ్వాసములో మాదిరిగా - ప్రభువు కొరకే పోరాడుము ||యౌవనుడా ||