Verse 1
సర్వాధికారి పరమోపకారి - ప్రభు వార్త చాటెదను
జయజయనాదం శ్రీయేసుగానం - స్వరమెత్తి పాడెదను....జయ
Verse 2
కష్టాలలోయలో కన్నీటి దిశలో కీర్తించి పాడెదను
నష్టాల ఊబిలో నన్నాదుకున్న - నామమును స్తుతియింతును ||సర్వాధి ||
Verse 3
నా పాపభారం తొలగించినాడు - నా వాడు నజరేయుడు
నా ఊపిరైనా నా కాపరైనా - నా యేసు భగవానుడు ||సర్వాధి ||
Verse 4
ఏ మంచి నాలో లేకున్న వేళ - నన్నెంతో ప్రేమించెను
ప్రేమించి నాకై మరణించి యేసు - మృతినే ఓడించెను ||సర్వాధి ||
Verse 5
దివినుండి భువికి దిగివచ్చి యేసు - నన్నెంతో దీవించెను
భువి నుండి దివికి వెళ్ళిన యేసు - త్వరలోనే ఏతెంచును ||సర్వాధి ||