Verse 1
మహోన్నతుని చాటున నివసించుచు
సర్వశక్తుని నీడలో విశ్రాంతి నొందుచు
ప్రభుసేవలో సాగెదము - పరలోకమే చేరెదము - 2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా || మహోన్నతుని ||
Verse 2
అంధకార బంధాల బ్రతుకులలో
చీకటి మూసిన జీవితాలలో - 2
వాక్యదివ్వెను వెలిగించుదాం - పాప బంధాలనే తెంచుదాం
పరిపూర్ణ మార్గమునే చూపుదాం ||హల్లెలూయా ||
Verse 3
దారి తొలగిన సోదరులెందరో
గమ్యము తెలియక తిరుగాడుచుండగా - 2
దివ్య సందేశమందించుదాం - ప్రభుసన్నిధికి నడిపించుదాం
పరలోక పధమున నడిపించుదాం ||హల్లెలూయా ||