Verse 1
ప్రశ్నించే నా ప్రాణమా
ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా
Verse 2
ఏల ఈ ఇరుకైన కరుకైన మార్గమని - ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా?
ఇరుకులో విశాలత కలుగజేయుట - కరుకైన దారిలో సరిచేసి నడుపుట
నా యేసు నాధుని ప్రత్యేకత ||కలత ||
Verse 3
ఏల ఈ నలుగుట విరుగుటయని - ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా?
నలిపి పరిమళింపజేయుట - విరిచి ఆశీర్వదించుట
నా యేసునాధుని ప్రత్యేకత ||కలత ||
Verse 4
ఏల ఈ శూన్యము నిరాధారమని - ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా?
శూన్యములో సమస్తమును చేయుట - ఆధారము లేకుండా నిలువబెట్టుట
నా యేసు నాధుని ప్రత్యేకత ||కలత ||
Verse 5
ఏల ఈ కరువు బరువు శ్రమల కొలిమియని - ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా?
కరువులో సమృద్ధినిచ్చుట - కొలిమిలో శుద్ధీకరించుట
నా యేసు నాధుని ప్రత్యేకత ||కలత ||
Verse 6
కలత చెందనేల కృంగి పోవనేల
నాదేవుని యందు నీవు నిరీక్షించుమా
నా రక్షణ కర్తనే సన్నుతించుమా