Verse 1
మరణమా ......... నీ ముల్లెక్కడ?
మరణమా ...... నీ విజయ మెక్కడ?
మరణమా నీ ముల్లెక్కడ - మరణమా నీ విజయమెక్కడ
మరణ తుల్యపు మానవులకై - మరణమొంది తిరిగిలేచిన
మరణ విజయుడు క్రీస్తుముందు || మరణమా ||
Verse 2
విధిరూపకమగు అధికారమును విరోధమైన ఋణపత్రమును
కల్వరిగిరిపై కరకు మేకులతో - దాస్యపు చేవ్రాత దహించివేసి
అపరాధములెల్ల అణచివేసి - జీవమిచ్చిన జీవాధిపతిముందు ||మరణమా ||
Verse 3
అపవాది తా అనుచరులందరి - అధికారులను ప్రధానులందరి
ఆయుధులను నిరాయుధులనుజేసి - అహంకారుల గర్వమణచి
దీనులకు కృప దయను జూపి - జయమునిచ్చిన జయశాలిముందు ||మరణమా ||
Verse 4
శుద్ధాత్మయను ఆదరణనిచ్చి - సమాధానం అనుగ్రహించి
నేనుండు స్థలములలో మీరుండు లాగున - మరలా వచ్చి కొనిపోదునని
మధ్యాకాశపు మార్గమందున - బూరతో రానున్న ధీశాలిముందు ||మరణమా ||