Verse 1
రమ్యమైన నీరూపం రక్తమాయెనే - 2
అంతులేదు అంతులేదు అంతులేదు నీ ప్రేమ
అంతులేదు, అంతులేదు, అంతులేదు నీ త్యాగం || రమ్యమైన ||
Verse 2
నేరములెన్నో చేసితినీ - దారితప్పి నేను తిరిగితినయ్యా - 2
నను దర్శించి నీ రక్షణ నొసగితివి
నా బ్రతుకు నేను మార్చుకొంటినయ్యా - 2 ||రమ్యమైన ||
Verse 3
నా శ్రమ సహియించి నావ్యాధిని భరియించి
నన్ను నీలో నీవే చేర్చుకున్నావు - 2
నీలోనే నేను ఐక్యమై పోయాను
నీపాద సన్నిధి నే చేరియున్నాను - 2 ||రమ్యమైన ||
Verse 4
పరిశుద్ధముగా - అనుకూలముగా
సజీవ యాగమై నేను నిలిచెదనయ్యా - 2
నీ సిలువ త్యాగం ధ్యానింతునయ్యా
నీ ప్రేమను నేను ప్రకటింతునయ్యా
నా బ్రతుకు నీకు అర్పింతునయ్యా - 2 ||రమ్యమైన ||