Verse 1
కలువరిగిరిపై కార్చిన రుధిరం కడిగెను నాదు కలుషం
కలుషము నెంచని క్రీస్తుని కృపతో నిండెను నాదు హృదయం
నా పాపశ్షిను భరియించెను
తన నీతి ఫలముతో నను నింపెను
హోసన్నా హోసన్నా హల్లెలూయా
Verse 2
శరీర క్రియలన్ని జయించుటకు-శుద్ధాత్మశక్తిని నాకొసగెను - 2
సంపూర్ణ మినిషిగా బ్రతుకుటకు - సర్వసత్యమును నడిపించెను
క్రీస్తునందు నా జీవితం - నూతన సృష్టిగా మారెను - 2
సమృద్ధి జీవము నాకిచ్చెను
సరియైన త్రోవలో నడిపించెను - 2
హోసన్నా హోసన్నా హల్లెలూయా ||కలువరి ||
Verse 3
అపాయములోనే పడినపుడు నన్ను లేవనెత్తి బ్రతికించెను
వ్యాధి బాధ వేదనలో నను స్వస్థపరచి దీవించెను - 2
క్రీస్తులో నుండి ఎడబాపలేదు - ఎన్నటికి ఏ శోధన - 2
నా అండగా యేసు నాకుండగా - జయజీవితం నేను జీవించెదన్
హోసన్నా హోసన్నా హల్లెలూయా ||కలువరి ||