Verse 1
అడవి వృక్షములలో - జల్దరు వృక్షమెట్లున్నదో
పరిశుద్ధుల మధ్యలో - అతిశ్రేష్టుడైన ప్రభుని...
Verse 2
నింద దూషణ ఇరుకులలో - నను సుగంధముగా మార్చెను
నీ కృపలో నన్ను నడిపి - నూతన జీవమునిచ్చిరే ||పాడెద ||
Verse 3
నా కష్ట తరంగములలో - దుఃఖసాగరములో యుండగా
నీ కుడి హస్తము చాపి - భయపడకని పలికితిరే ||పాడెద ||
Verse 4
ఆనంద భరితుడై నేను - నీ ప్రేమలో నుండుటకు
నీ స్వరము నాకతిమధురం - నీ ముఖము మనోహరము ||పాడెద ||
Verse 5
నీ చిత్తము చేయుటకు - నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుదముట్టించి - నీ సన్నిధిలో నడ్చెదన్ ||పాడెద ||
Verse 6
పాడెదన్ - నాదు ప్రియుని - జీవకాలమెల్ల అరణ్యయాత్రలో
కృతజ్ఞతతో పాడెదను