Verse 1
నీ మందిరమై నేనుండగా - నాయందుండి నడిపించవా
నీతోడుండగా - నాకు దిగులుండునా - వెంబడిస్తాను నినుయేసువా
Verse 2
నీవు కోరేటి దేవాలయం - నా హృదయంబెగా నిశ్చయం
నీ ప్రత్యక్షత నాకు కలిగించవా - నిత్యము నిన్ను స్తుతియింతును ||నీ ||
Verse 3
నాడు నిర్మించె దేవాలయం - రాజుసొలోమోను బహుసుందరం
అట్టి దేవాలయం నాకు కలిగించవా - నీ కట్టడలలో నను నిలుపుమా ||నీ ||
Verse 4
హన్నా ప్రార్ధనలు విన్నావుగా - నేనున్నానని అన్నావుగా
నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవా నాతోటి మాట్లాడవా ||నీ ||
Verse 5
ఆత్మ సత్యముతో ఆరాధింప - ఆత్మదేవుడా నేర్పించుమా
మహిమ చూపించుము నేను దర్శింపను - నా నేత్రంబు వెలిగించుమా ||నీ ||
Verse 6
పరలోక ప్రతిబింబమై - ఈ ధరలోన దీపంబునై
ధరణి వెలిగించుము - కరుణ ప్రసరింపుము
కరముతో నిత్యము నడిపించుమా ||నీ ||