Verse 1
అనురాగ మయము యేసు ఉన్న గృహము
సమాధాన నిలయము క్రీస్తు కేంద్ర గమనము
ఆనంద నందన పురము విలువగు ఆత్మీయ ధనము
సిరులు నిండిన స్వర్గము సమృద్ధి ఫలిమిచ్చు ద్రాక్షావనము
Verse 2
ప్రభునెరిగిన బిడ్డలతో సహవాసము - క్రీస్తు చెలిమితో సమానము
నీతి న్యాయ విలువలతో జీవించడము - యేసుని లోకానికి చూపించడము
ఈ ..... గుణములు కలిగిన కుటుంబము
ఈ ...సంబరము నిండిన జీవనము ||ఆనంద ||
Verse 3
నిత్యము ప్రార్థించే అనుభవము యేసయ్యకు బహుప్రియము
వాక్యముతో అనుదినము అనుబంధము
స్వర్గానికి సాగే ప్రయాణము ||ఆనంద|| ||ఈ గుణములు ||
Verse 4
ప్రతీ క్షణం తండ్రితో సంబంధము
క్లిష్టమైన శ్రమలలోను జయం ఖాయము
పరము తట్టు చూచే ప్రతినేత్రము
దర్శించును పరమాత్ముని మహిమ రూపము ||ఆనంద||
సమర్పణ గీతములు