Verse 1
యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా
Verse 2
ఆకలిగొనియున్నవేళ ఆహారమిచ్చి
నీ గుప్పిలి విప్పి కోరిక తీర్చావు ఆ... - 4
కృంగిన నన్ను లేపావు దేవా
నా మొర్ర నాలించి రక్షించినావు ||యేసయ్యా ||
Verse 3
వేటకాని ఉరి నుండి రక్షించినావు
ప్రేమించి నాకై ప్రాణము నిచ్చావు ఆ... - 4
కను పాపవలె కాపాడు దేవా
నా మంచి కాపరి నీవే ప్రభూ ||యేసయ్యా ||
Verse 4
ఉపకారము లన్ని తలపోసికొనుచు
నా మ్రొక్కు బడులు చెల్లించు కొందు ఆ... - 4
రక్షణ పాత్రను నే చేత బూని
ప్రార్ధింతు నీకు నా యేసునాధా ||యేసయ్యా ||